kntv
kntv

అధికారులు లేక వెలవెలబోతున్న చెన్నూరు-2 సచివాలయం

1 month ago

చెన్నూరు, శుక్రవారం: చెన్నూరు-2 సచివాలయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక కార్యాలయం వెలవెలబోయింది. సమస్యలపై వచ్చిన ప్రజలు సిబ్బంది లేక నిరాశగా వెనుదిరిగారు. మండలంలోని పలు సచివాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.