kntv
kntv

కోసిగిలో తాగునీటి సమస్యపై MLA బాలనాగిరెడ్డి ఆగ్రహం

2 hours ago

కోసిగి మండల కేంద్రంలో తాగునీటి ఎద్దడిపై మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి స్పందించారు. నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమస్య పరిష్కరించి నిరంతర నీటి సరఫరా అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.