kntv
kntv

సర్పంచ్ లావణ్య కుటుంబానికి అండగా మహిళా నేతలు..!

3 weeks ago

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, ఐతంపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీమతి లావణ్య గారికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళా నాయకులు ఐతంపూడి గ్రామానికి చేరుకుని లావణ్య గారిని పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.