శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Akkineni Nageswara Rao college : అక్కినేని నాగేశ్వర రావు కళాశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    3 weeks ago

    జగ్గయ్యపేట, జనవరి 26 

    స్థానిక అక్కినేని నాగేశ్వర రావు కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

     

    అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు అందించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలు దేశ ప్రగతికి పునాదులని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

     

    ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.జె.ఎస్. కుమార్ మాట్లాడుతూ, దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడడంలో యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చుకోవడం ద్వారా మాత్రమే సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని ఆయన పేర్కొన్నారు.

     

    ఈ వేడుకల్లో కళాశాల పాలకవర్గ అధ్యక్షులు శ్రీ ఎల్. రామకృష్ణ ప్రసాద్, కోశాధికారి శ్రీ పర్వతనేని కృష్ణ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి బి.ఎస్.ఎస్. పద్మజ, ఎన్.సి.సి. ఆఫీసర్ లెఫ్టినెంట్ ఎం.డి. సలీమ్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామర్ శ్రీ ఎం. జేసుబాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్.సి.సి. క్యాడెట్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Hrithik Roshan shares new photos with dog Zane
    తర్వాత ఆర్టికల్
    Ursula von der Leyen stuns in Banarasi silk jacket at Republic Day 2026

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి