శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Revanth Reddy : తెలంగాణ–దక్షిణాఫ్రికా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం.. హైదరాబాద్‌లో కీలక భేటీ

    54 minutes ago

    తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ Paul Mashatile నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి Revanth Reddyతో భేటీ అయ్యింది. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజం రంగాల్లో పెట్టుబడులు, సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

     

    ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా కంపెనీలకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు దక్షిణాఫ్రికా ప్రతినిధులను ఆహ్వానించారు. భారత్–దక్షిణాఫ్రికా మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసిన మషాటిలే, ఫార్మా రంగంలో సహకారం, ఉత్పత్తి భాగస్వామ్యాలను పెంపొందించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India-US trade deal within reach, final 1% remains under discussion: Sergio Gor
    తర్వాత ఆర్టికల్
    5,300-year-old yeast from Oetzi the Iceman's body makes delicious sourdough bread, while brewing beer remains on the list!

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి