శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Vaibhav Sooryavanshi 15 ఏళ్లకే కోట్లు కొల్లగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో భారీ ఆదాయం

    1 hour ago

    Vaibhav Suryavanshi ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న ఈ యువ బ్యాటర్, ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు బాది Chris Gayle పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, ఎమర్జింగ్ ప్లేయర్ వంటి పలు అవార్డులను కైవసం చేసుకున్నాడు.

     

    Rajasthan Royals తరఫున ఆడిన వైభవ్‌కు రిటైనర్ ఫీజుగా రూ.1.10 కోట్లు లభించగా, 16 మ్యాచ్‌లకు మ్యాచ్ ఫీజుల రూపంలో మరో రూ.1.20 కోట్లు అందాయి. సీజన్ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు, అదనంగా పలుమార్లు గెలుచుకున్న మ్యాచ్ అవార్డుల నగదు బహుమతులతో కలిపి అతని మొత్తం ఆదాయం రూ.2.85 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తోంది. ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అత్యంత విలువైన యువ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Sebi proposes relief for road InvITs, may allow maintenance debt to be added back in cash flow calculations
    తర్వాత ఆర్టికల్
    Dembele brings PSG's Champions League trophy to French Open - Watch

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి