శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Guntakandla Jagadish Reddy : పవన్–కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌?.. సంచలన ఆరోపణలు చేసిన జగదీశ్ రెడ్డి

    52 minutes ago

    జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి Guntakandla Jagadish Reddy తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మరింత ఆలోచించి మాట్లాడాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పవన్ కల్యాణ్ కలిసి రాజకీయ నాటకానికి తెరలేపారని ఆయన ఆరోపించారు.

     

    తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభపై ప్రభుత్వం విధించిన ఆంక్షల వెనుక రాజకీయ కుట్ర ఉందని జగదీశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందనే అనుమానాలు ఈ పరిణామాలతో బలపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ హైడ్రామా నడుస్తోందని ఆరోపిస్తూ, రాజకీయ లబ్ధి కోసమే ఈ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Why Is The Stock Market Falling Today? Sensex Sheds 1,000 Points, IT Stocks Crash
    తర్వాత ఆర్టికల్
    FWICE WITHDRAWS non-cooperation directive against Ranveer

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి