శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    PEDDI MOVIE : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘పెద్ది’.. విడుదలకు ముందే రూ.100 కోట్ల హంగామా!

    1 hour ago

    మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన Peddi విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన ఈ చిత్రానికి పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్‌లో రూ.10 కోట్లకు పైగా, బెంగళూరులో రూ.1.5 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ గణాంకాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను ప్రతిబింబిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

     

    ప్రస్తుత బుకింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే ప్రీమియర్స్, తొలి రోజు కలిపి దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ మార్కెట్లలో కూడా బుకింగ్స్ ఇదే స్థాయిలో కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.125 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవచ్చని చెబుతున్నారు. పాజిటివ్ టాక్, మంచి సమీక్షలు వస్తే పెద్ది 2026లో అతిపెద్ద థియేట్రికల్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Love vs ego: 7 powerful differences that can make or break your relationship
    తర్వాత ఆర్టికల్
    FIFA World Cup: Kerala boy Tahsin Jamshid to play for Qatar

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి