శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Cyient to acquire Tao Digital : అమెరికా కంపెనీ టావో డిజిటల్‌ను కొనుగోలు చేయనున్న సైయెంట్‌.. డీల్‌ విలువ రూ.2,071 కోట్లు

    34 minutes ago

    హైదరాబాద్‌కు చెందిన CyientLimited తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా అమెరికా ఆధారిత TAO Digital Solutions Inc.ను పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ప్రధాన కార్యాలయం కలిగిన టావో డిజిటల్‌ ఏఐ-నేటివ్‌ డేటా, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సేవలను అందిస్తోంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ 21.8 కోట్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.2,071 కోట్లు)గా నిర్ణయించబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ లావాదేవీ పూర్తి కావచ్చని సైయెంట్‌ వెల్లడించింది.

    2022లో స్థాపించబడిన టావో డిజిటల్‌ అమెరికా, కెనడా, భారత్‌, తైవాన్‌, యూరప్‌ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆటోమోటివ్‌, హై-టెక్‌, హెల్త్‌టెక్‌ వంటి రంగాల్లోని గ్లోబల్‌ సంస్థలకు డేటా ఇంజనీరింగ్‌, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, డిజిటలైజేషన్‌, క్లౌడ్‌ సేవల రూపంలో సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది. ప్రస్తుతం 3,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థను సొంతం చేసుకోవడం ద్వారా ఏఐ, డిజిటల్‌ ఇంజనీరింగ్‌ రంగాల్లో తమ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలని సైయెంట్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    DK Shivakumar : సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు.. డీకే శివకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు
    తర్వాత ఆర్టికల్
    IPL Final: RCB lose two quick wickets; Virat Kohli keeps chase on track

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి