శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    AP CM NARACHANDRABABU : స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులు

    7 hours ago

    అమరావతి:
    స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వడ్డె ఓబన్న చేసిన త్యాగాలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల సేవలను భావితరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.  వడ్డె ఓబన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన దేశభక్తి ప్రతి ఒక్కరిలో దేశంపై ప్రేమను పెంపొందిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.   ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని వడ్డె ఓబన్నకు నివాళులు అర్పించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Another milestone! Virat Kohli goes past Sourav Ganguly
    తర్వాత ఆర్టికల్
    IND vs NZ: NZ openers settle in as India hunt for breakthrough

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి