శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Bheema Bai Mahila Mandal : సేవా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం భీమాబాయి మహిళా మండలి: టిడిపి నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు

    3 weeks ago

    కాకినాడ( తొలి ఉదయం) 

    సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, అనారోగ్య భారంతో బాధపడుతున్న కుటుంబాలు, దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న వారి కోసం భరోసాగా నిలుస్తూ వెలుగులు నింపుతున్న సంస్థ భీమాబాయి మహిళా మండలి అని కాకినాడ సిటీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ప్రశంసించారు.

    సోమవారం కాకినాడ రామారావుపేట పాము వారి వీధిలోని కమ్యూనిటీ హాల్లో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముంథా తుఫాన్ రిలీఫ్ యాక్టివిటీస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా మల్లిపూడి వీరు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా నిరంతర సేవలు చేస్తూ, ఆపన్నుల పాలిటీ ఆత్మబంధువుగా భీమాబాయి మహిళా మండలి నిలుస్తోందని ముఖ్యంగా సంస్థ అధ్యక్షురాలు వాశంశెట్టి నందివర్ధని నాయకత్వంలో ఈ బృందం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మేమున్నాం అనే భరోసా ఇవ్వడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు.

    భీమాబాయి మహిళా మండలి అధ్యక్షురాలు వాశంశెట్టి నందివర్ధని మాట్లాడుతూ 

    సేవే మా లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా ఎవ్వరూ నిరాశ చెందకూడదన్నదే మా తపన. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో భవిష్యత్‌లో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

    ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, సామర్లకోట మండలాలకు చెందిన 

    పలువురు బాధిత కుటుంబాలకు సుమారు రూ 9 వందల రూపాయలు విలువ చేసే పౌష్టికాహార కిట్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సహాయం అందడంతో వారు భీమాబాయి మహిళా మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

    సమాజంలో సేవా భావనను పెంపొందిస్తూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న భీమాబాయి మహిళా మండలి సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    LIVE: Gold Prices Today (Jan 27) Continue To Soar, Check 22K & 24K Rates Per Gram In Your City
    తర్వాత ఆర్టికల్
    'He deserves another chance': Ex-India captain's strong message to Agarkar over Sarfaraz

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి