శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Drug-Free Andhrapradesh : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు – రూరల్ సీఐ చవాన్

    3 weeks ago

    కచికచర్ల, జనవరి 27 (వెబ్‌న్యూస్):

    ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నందిగామ రూరల్ సీఐ చవాన్ పిలుపునిచ్చారు. మంగళవారం కంచికచర్ల పట్టణంలో డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు.

     

    ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల్లో యువతకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వల్ల యువత తప్పుదారులు పడుతూ నేరాలకు పాల్పడుతున్నారని, దీని కారణంగా కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతున్నాయని సీఐ చవాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

     

    పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, రూరల్ జోన్ డీసీపీ లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ దండయాత్ర చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమైన డ్రగ్స్‌పై దండయాత్ర (సైకిల్ యాత్ర)లో భాగంగానే కంచికచర్లలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

     

    కంచికచర్ల పట్టణంలోని ఎమ్‌ఐసీ, ఎమ్‌వీఆర్, అమృత్ సాయి కళాశాలల విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించగా, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సీఐ సూచించారు.

     

    ఈ కార్యక్రమంలో చందర్లపాడు ఎస్సై ధర్మరాజు, కంచికచర్ల ఎస్సై విశ్వనాథ్, వీరులపాడు ఎస్సై అభిమన్యు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    O'Romeo: Disha and Shahid's new song Aashiqon Ki Colony out
    తర్వాత ఆర్టికల్
    Making of Budget 2026: How plans and demands make it to FM Sitharaman's Bahikhata?

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి