శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Fraud Transactions in Yes Bank : యెస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డుల్లో అనధికార లావాదేవీలు – రూ.2.35 కోట్ల మోసం వెలుగులోకి

    1 hour ago

    ప్రైవేట్ రంగంలోని ప్రముఖ యెస్‌ బ్యాంక్‌లో మల్టీ కరెన్సీ ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డుల ద్వారా అనధికారిక లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. బుక్‌మైఫారెక్స్‌తో భాగస్వామ్యంతో జారీ చేసిన ఈ కార్డుల ద్వారా దాదాపు 5,000 మంది కస్టమర్లకు సంబంధించిన వివరాలతో సుమారు 2,80,000 డాలర్లు (రూ.2.35 కోట్లు) విలువైన లావాదేవీలు లాటిన్ అమెరికా దేశంలో ఫిబ్రవరి 24న ఉదయం 3:30 నుంచి 8:30 గంటల మధ్య జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. ఆ తర్వాత కూడా 688 అనధికారిక లావాదేవీ ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వివరణ కోరినట్లు సమాచారం.

    మోసానికి గురైన కస్టమర్లకు ఆర్థిక నష్టం ఉండదని యెస్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన కార్డుల స్థానంలో కొత్త ఫారెక్స్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. తమవద్ద సీవీవీ వంటి సున్నితమైన డేటా భద్రపరచలేదని బుక్‌మైఫారెక్స్‌ పేర్కొంది. ఈ ఘటనతో డేటా భద్రతపై ఆర్‌బీఐ పర్యవేక్షణ మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Rashmika-Vijay drop FIRST PICS as husband and wife: See inside
    తర్వాత ఆర్టికల్
    No Rate Hike, No Problem? Why Banks Still Check Your Credit Score First

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి