శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Huge Expectations on Ustaad Bhagat Singh ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్ :పవన్ ఫ్యాన్స్‌లో భారీ జోష్

    1 hour ago

    రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫీవర్ ఇప్పటికే మొదలైంది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Pawan Kalyan అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల క్రితం వచ్చిన Gabbar Singh వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, మళ్లీ అదే కాంబినేషన్‌లో దర్శకుడు Harish Shankar ఈ సినిమాను తెరకెక్కించడంతో ‘మ్యాజిక్ రిపీట్ అవుతుందా?’ అన్న ఆసక్తి నెలకొంది. గబ్బర్ సింగ్ అప్పట్లో సృష్టించిన రికార్డులు, ఫ్యాన్స్‌లో వచ్చిన ఉత్సాహం ఇప్పటికీ గుర్తుండేలా ఉండగా, ఈ సినిమా కనీసం ఆ స్థాయిలో హిట్ అయినా సంచలనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఇదిలా ఉంటే, ఈ సినిమా Theri రీమేక్ అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఇది రీమేక్ కాదని, కేవలం లైన్ మాత్రమే తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా కథను పూర్తిగా మార్చినట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘భగత్ సింగ్’ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, ఆయన ఖాకీ లుక్, పంచ్ డైలాగ్స్ ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఆయన ప్రస్తుత రాజకీయ స్థానం దృష్ట్యా సినిమాలో పొలిటికల్ టచ్, సామాజిక అంశాలపై బలమైన డైలాగ్స్ ఉండబోతున్నాయని సమాచారం. మొత్తంగా చూస్తే, యాక్షన్, ఎమోషన్, పొలిటికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అభిమానులకు పూర్తి ప్యాకేజ్‌గా మారే అవకాశముంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    The White Lotus Season 4: Star cast heads to Saint-Tropez
    తర్వాత ఆర్టికల్
    Is the ‘vacuum belly’ workout safe? Taiwan singer’s viral performance triggers health concerns online

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి