శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Jana Sena Membership Camps Launched in Challapalli : చల్లపల్లిలో జనసేన సభ్యత్వ శిబిరాలు ప్రారంభం.. మండలి వెంకట్రామ్ సమక్షంలో భారీ చేరికలు

    1 hour ago

    కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. చల్లపల్లిలో నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఆర్య వైశ్య యువనేత ఉరిమి మణికాంత్, మండల నాయకులు అనుమకొండ పూర్ణచంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్, ఏటీఎం సెంటర్‌లలో ఏర్పాటు చేసిన శిబిరాలకు విశేష స్పందన లభించింది. పార్టీ అధినేత Pawan Kalyan పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఉద్యమి సభ్యత్వ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని వెంకట్రామ్ పేర్కొన్నారు.

     

    ఈ సందర్భంగా వక్కలగడ్డ నుంచి మట్టా చిన్నా ఆధ్వర్యంలో ఇరవై మంది ఎస్సీ మహిళలు జనసేన పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. అలాగే అఖిల భారత దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా కిషోర్ తదితరులు కూడా వెంకట్రామ్ సమక్షంలో జనసేనలో చేరి ఉద్యమి సభ్యత్వం స్వీకరించారు. మహిళలు, యువకులు, పెద్దలు పెద్దఎత్తున పార్టీలో చేరడంతో చల్లపల్లిలో రాజకీయ చైతన్యం మరింత ఊపందుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Dial Your APEPDCL డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి 43 ఫిర్యాదులు - ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఐఏఎస్
    తర్వాత ఆర్టికల్
    Middle East conflict drags down tourism, aviation shares: IndiGo falls almost 7%, Ixigo down 14%

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి