శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Wisdom Tooth Removal Affect Eyesight Experts : జ్ఞాన దంతాలు తీసేయడం వల్ల కళ్లపై ప్రభావం ఉంటుందా? నిపుణుల వివరణ

    4 hours ago

    సాధారణంగా ఒక వ్యక్తికి 32 దంతాలు ఉంటాయి. వాటిలో 20 సంవత్సరాల వయసు తర్వాత చివరగా వచ్చే నాలుగు దంతాలను జ్ఞాన దంతాలు (Wisdom Teeth) అంటారు. ఇవి పై, కింది దవడల వెనుక భాగంలో పెరుగుతాయి. చిన్న వయసులో దవడ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల, పెద్దయ్యాక కూడా కొందరికి ఈ దంతాలు సరిగా బయటకు రావడానికి స్థలం సరిపోదు. దీంతో అవి వంకరగా పెరగడం, దవడలో ఇరుక్కుపోవడం, ఒత్తిడి పెరగడం వలన నొప్పి కలగడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్, చిగుళ్ల వాపు, పక్క దంతాలకు నష్టం వంటి సమస్యలు కూడా వస్తాయి.

     

    జ్ఞాన దంతాలు తీసేస్తే కళ్లకు హాని జరుగుతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా అపోహ మాత్రమే. జ్ఞాన దంతాలు నోటి వెనుక భాగంలో ఉంటాయి; అవి కంటి నరాలకు లేదా మెదడుకు దగ్గరగా ఉండవు. దంతాన్ని తొలగించే సమయంలో పన్ను మరియు దాని చుట్టూ ఉన్న కణజాలాన్ని మాత్రమే తీసేస్తారు. కాబట్టి చూపు తగ్గడం లేదా కళ్లపై ప్రభావం పడటం వంటి సమస్యలు రావు. నొప్పి, ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఇబ్బందులు ఉంటే డెంటిస్ట్ సలహాతో జ్ఞాన దంతాలను తొలగించుకోవడం సురక్షితం. అయితే అవి సరిగ్గా పెరిగి ఎలాంటి సమస్యలు లేకపోతే తీసేయాల్సిన అవసరం లేదు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Abhay and Shanaya's comedy officially titled Jacob Cardoso
    తర్వాత ఆర్టికల్
    2nd ODI Live Score: Harmanpreet, Pratika hit fifties as India post 251/9 vs Australia

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి