శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ugadi 2026 ఉగాది 2026: కొత్త సంవత్సరానికి ఆహ్వానం – సంప్రదాయం, సంస్కృతి, సంతోషాల సందడి

    1 hour ago

    శ్రీ పరాభవ నామ సంవత్సర ప్రారంభాన్ని సూచించే ఉగాది పండుగ తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది. చైత్ర మాసం శుక్ల ప్రతిపద రోజున జరుపుకునే ఈ పర్వదినం కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది. “యుగాది” అనే పదం సంస్కృతంలో “యుగాది” అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది, కర్ణాటకలో యుగాది, మహారాష్ట్రలో గుఢీ పాడవా, తమిళనాడులో పుత్తాండు వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు.

    ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, గడపలకు పసుపు కుంకుమలు పెట్టడం, మామిడి ఆకులతో తోరణాలు కట్టడం వంటి సంప్రదాయాలు పాటిస్తారు. దేవుడి గదిని శుభ్రపరచి అలంకరించి, ధూప దీపాలతో పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉగాది పచ్చడిని తయారు చేసి నైవేద్యంగా సమర్పించి, తరువాత ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ పచ్చడిలో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు వంటి రుచులు ఉండటం జీవితం అనేక అనుభవాల సమ్మేళనమని సూచిస్తుంది.

    ఈ పండుగలో మరో ముఖ్య ఆచారం పంచాంగ శ్రవణం. ఇందులో కొత్త సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, ఫలితాలు, వర్షపాతం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, శాంతి వంటి విషయాలను తెలుసుకుంటారు. ఇది కేవలం ఫలాలు వినడమే కాకుండా, మన జీవితాన్ని సమతుల్యంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో సూచిస్తుంది. శుభం, అశుభం, సుఖం, దుఃఖం అన్నీ జీవితం లో భాగమని అంగీకరించి ముందుకు సాగాలని ఉగాది మనకు నేర్పుతుంది. మిత్రులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు! ఓం నమో నారాయణాయ.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock market crash today: Nifty50 below 23,300; BSE Sensex plunges over 1,600 points as oil prices rise, US Fed flags inflation - top reasons for fall
    తర్వాత ఆర్టికల్
    ‘What’s the big deal?’: Ashwin shuts down hype over Shivam Dube’s train ride

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి