శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nara Lokesh : నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. రాజకీయంగా వేడెక్కిన వివాదం

    1 hour ago

    ఆంధ్రప్రదేశ్‌లోని Nandyalలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనివాస సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy విగ్రహాన్ని జంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. విగ్రహం తల భాగాన్ని వేరుచేయడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య వైసీపీ నేతల అనుచరుడేనని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక ఫోటోను పంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన లోకేష్, ఈ ఘటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Karuppu': How Suriya nailed the fierce Kavakara Karuppu makeover
    తర్వాత ఆర్టికల్
    Why Vaibhav Sooryavanshi is in Ahmedabad despite RR missing the IPL Final

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి