శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kalvakuntla Kavitha : పసుపు రంగుపై కవిత క్లారిటీ.. చంద్రబాబు, రేవంత్‌తో సంబంధం లేదన్న మాజీ ఎమ్మెల్సీ

    45 minutes ago

    తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై వస్తున్న విమర్శలకు మాజీ ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha ఘాటుగా స్పందించారు. పసుపు రంగు అంటే తనకు ఎంతో ఇష్టమని, అది ఏ ఒక్క పార్టీకి సొంతం కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రజలకు పసుపు ప్రత్యేక సెంటిమెంట్ అని, మహిళల జీవితాల్లో కూడా పసుపుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. పసుపు రంగు వెలుగు, శ్రేయస్సు, సమృద్ధికి ప్రతీకగా భావించి తమ పార్టీ జెండాలో చేర్చినట్లు వెల్లడించారు.

    అలాగే తెలంగాణ జాగృతి నుంచి రాజకీయ పార్టీ స్థాయికి వచ్చిన నేపథ్యంలో జాగృతి జెండాలోని ఆకుపచ్చ రంగును కొనసాగించామని కవిత తెలిపారు. రైతులు, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి ఆకుపచ్చ రంగును, శ్రామికులు, ఎస్సీలు మరియు సామాజిక తెలంగాణ భావజాలానికి నీలి రంగును జెండాలో చేర్చినట్లు వివరించారు. తమ పార్టీ జెండాలోని పసుపు రంగుకు N. Chandrababu Naidu లేదా Anumula Revanth Reddyతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత, తన రాజకీయ నిర్ణయాలను పూర్తిగా స్వతంత్రంగానే తీసుకుంటున్నానని పేర్కొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Vivek guides Karan on 'Desi Bling'
    తర్వాత ఆర్టికల్
    PM Narendra Modi Mann Ki Baat : వడగాల్పులపై ప్రధాని మోదీ హెచ్చరిక.. దేశీయ పానీయాలు తాగాలని ప్రజలకు సూచన

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి