శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    PM Narendra Modi Mann Ki Baat : వడగాల్పులపై ప్రధాని మోదీ హెచ్చరిక.. దేశీయ పానీయాలు తాగాలని ప్రజలకు సూచన

    1 hour ago

    దేశవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని Narendra Modi ప్రజలకు కీలక సూచనలు చేశారు. తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 134వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన, వేసవి ప్రభావం నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖలు జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని చెప్పారు.

    వేసవిని తట్టుకోవడానికి సాంప్రదాయ భారతీయ పానీయాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆమ్ పన్నా, పంజాబ్-హర్యానాలో లస్సీ, రాజస్థాన్-గుజరాత్ ప్రాంతాల్లో మజ్జిగ, బీహార్-జార్ఖండ్ ప్రాంతాల్లో సత్తు శర్బత్, గోవా-కొంకణ్ ప్రాంతాల్లో కోకం శర్బత్, సోల్ కఢి వంటి పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో పానకం, నీర్ మోర్, సంబారం, ఒడిశాలో బేలా పన్నా వంటి పానీయాలు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయని చెప్పారు. ఈ దేశీయ పానీయాలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Kalvakuntla Kavitha : పసుపు రంగుపై కవిత క్లారిటీ.. చంద్రబాబు, రేవంత్‌తో సంబంధం లేదన్న మాజీ ఎమ్మెల్సీ
    తర్వాత ఆర్టికల్
    Nara Chandrababu Naidu Fire On Bakkani Narismlu : తెలంగాణపై వ్యాఖ్యలు సరికావు.. బక్కని నర్సింలుకు చంద్రబాబు చురకలు

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి