శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Pakistan national cricket team : వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌కు అరుదైన ఘనత.. 1000 మ్యాచ్‌లు పూర్తి చేసిన మూడో జట్టు

    58 minutes ago

    Pakistan cricket team వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుంది. రావల్పిండి వేదికగా Australia national cricket teamతో జరుగుతున్న తొలి వన్డే పాకిస్థాన్‌కు 1000వ వన్డే మ్యాచ్‌గా నిలిచింది. దీంతో వన్డే క్రికెట్‌లో 1000 మ్యాచ్‌లు పూర్తి చేసిన ప్రపంచంలోని మూడో జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో India national cricket team 1075 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 1020 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది.

    ఈ ప్రత్యేక సందర్భంగా పాక్ కెప్టెన్ Shaheen Shah Afridiకు ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ Josh Inglis ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అలాగే ఈ చారిత్రాత్మక మ్యాచ్ ద్వారా Arafat Minhas అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గెలుపుల శాతాన్ని పరిశీలిస్తే ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో, పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. 1973 ఫిబ్రవరి 11న న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడిన పాకిస్థాన్, 53 ఏళ్ల ప్రయాణంలో 12 ప్రపంచకప్‌లలో పాల్గొని 1992లో ఒక్కసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    PM-SETU అమలులో దేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. విశాఖ ఐటీఐలకు నూతన రూపు
    తర్వాత ఆర్టికల్
    Fiber Deficiency in India : భారతీయుల్లో 70% మందికి ఫైబర్ లోపం.. మహిళల్లో మరింత ఆందోళనకర పరిస్థితి

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి