శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ram Charan Peddi Movie : ‘పెద్ది’కి తెలంగాణలో టికెట్ ధరల ట్విస్ట్.. కలెక్షన్లపై ప్రభావం పడేనా?

    1 hour ago

     మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న Peddi విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. Janhvi Kapoor హీరోయిన్‌గా నటిస్తుండగా, Divyenndu Sharma, Jagapathi Babu, Shiva Rajkumar, Boman Irani వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్లు జోరుగా సాగుతుండగా, సినిమా విడుదలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

    అయితే విడుదలకు ముందు టికెట్ ధరల అంశం చిత్ర యూనిట్‌కు సవాల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదని సమాచారం. వారం రోజుల పాటు ప్రత్యేక ధరలు అమలు చేసేందుకు నిర్మాతలు చేసిన వినతులకు స్పందన రాకపోవడంతో న్యాయపరమైన మార్గాన్ని ఆశ్రయించినా ఆశించిన ఫలితం దక్కలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్‌కు కీలకమైన నైజాం మార్కెట్‌లో ధరల పెంపు లేకపోతే ప్రారంభ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Love quote of the day by Aristotle: "Love is composed of a single soul inhabiting two bodies"
    తర్వాత ఆర్టికల్
    CBeebies star Justin Fletcher moves in Samantha Dorrance

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి