శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Janasena Party : పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు

    1 hour ago

    పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ మణికుమార్‌కు ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఒక సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా పోస్టర్‌పై చెప్పులతో కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను ప్రచారం చేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు జతచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఇలాంటి చర్యలు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాజకీయ విద్వేషాలను ప్రేరేపించే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమైనవే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననం చేసే విధంగా అవమానకర ప్రచారాలు సమర్థనీయం కావని పేర్కొన్నారు. సంబంధిత సోషల్ మీడియా ఖాతా నిర్వాహకులు, వీడియో రూపొందించి ప్రచారం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ysrcp Party : పేదల ఇళ్ల స్థలాలను కంపెనీలకు కేటాయించొద్దు: ఎమ్మెల్యే చినరాజప్పపై దొరబాబు విమర్శలు
    తర్వాత ఆర్టికల్
    Arsenal vs PSG Live : Arsenal chase first Champions League crown as PSG eye back-to-back titles

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి