kntv
kntv

పోలాల అమావాస్య.. పిల్లల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక వ్రతం

38 minutes ago

శ్రావణ కృష్ణ పక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు. పిల్లల ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, అపమృత్యు భయం తొలగాలని తల్లులు పోలేరమ్మ ను పూజిస్తారు. పసుపుతో అమ్మవారిని ప్రతిష్ఠించి, వినాయకుడితో కలిసి పూ జ చేసి తోరాలు కట్టి, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. ఈ వ్రతంతో కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.