Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    kntvtelugu
    kntvtelugu

    Rashmika mandanna speaks out against ai : రష్మిక హెచ్చరిక: ఏఐ దుర్వినియోగం మహిళలపై నైతిక పతనం సూచిస్తోంది

    2 weeks ago

    సినీ నటి రష్మిక మందన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్ సృష్టించడం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇటువంటి చర్యలు సమాజంలో కొందరి నైతిక పతనాన్ని సూచిస్తున్నట్లు తెలిపారు. ఏఐ సాంకేతికతపై రష్మిక మాట్లాడుతూ, "నిజాన్ని కూడా సృష్టించగలిగే ఈ కాలంలో, వివేచన మనకు గొప్ప రక్షణ. ఏఐ అభివృద్ధికి దోహదపడే శక్తి, కానీ దానిని మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యతను సృష్టించడానికి వాడటం లోతైన నైతిక పతనాన్ని చూపిస్తుంది" అన్నారు.

     

     "ఇంటర్నెట్ వాస్తవానికి అద్దం పట్టదు, అది ఏదైనా సృష్టించగల ఒక కాన్వాస్‌గా మారింది. ఈ దుర్వినియోగాన్ని అధిగమించాలి. గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ఏఐని ఉపయోగించుకోవాలి. బాధ్యతగా మెలగడం నేర్చుకోవాలి. మనుషుల్లా ప్రవర్తించని వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి."  ఇటీవల కాలంలో ఏఐ డీప్‌ఫేక్‌ల బారిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

     

    Click here to Read More
    Previous Article
    Virat Kohli breaks Sachin Tendulkar's ODI record :విరాట్ కోహ్లి సెంచరీతో సచిన్ రికార్డు సమం: కింగ్ కోహ్లి మరో ఘనత
    Next Article
    Chiranjeevi Heartwarming Post Viral :మై డియర్ బ్రదర్ వెంకీ.. ప్రతి క్షణాన్ని ఆస్వాదించా: చిరంజీవి ఎమోషనల్ నోట్

    Related నమస్తే సోదరా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment