శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ravi Teja–Shiva Nirvana Film Rumours : రవితేజ–శివ నిర్వాణ సినిమా గురించి వైరల్ వార్తలు ఫేక్‌! నిర్మాణ సంస్థ ఖండన

    1 నెల క్రితం

    మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేయనున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

    శివ నిర్వాణ – రవితేజ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో ఆరుగురు హీరోయిన్‌లు నటించనున్నారని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం అధికారికంగా స్పందించింది.

     

    "వీటి అన్నీ ఫేక్‌ వార్తలు" – నిర్మాతల స్పష్టీకరణ

    నిర్మాణ సంస్థ ఈ రూమర్‌లపై క్లారిటీ ఇస్తూ— “ప్రచారం అవుతున్న వార్తలన్నీ పూర్తిగా అసత్యం. నమ్మొద్దు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం,” అని స్పష్టం చేసింది.

    ఇంతో రవితేజ కొత్త సినిమా గురించి వస్తున్న ఊహాగానాలకు నిర్మాతలు గట్టి బ్రేక్ వేసినట్లైంది.

     

    ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి సిద్ధం

    రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలా రాణిస్తుందో టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    roshan kanakala mowgli trailer : రోషన్ కనకాల హీరోగా ‘మోగ్లీ’ – సందీప్ రాజ్ కొత్త ప్రయోగం, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్
    తర్వాత ఆర్టికల్
    copying a train scene from Trivikram Srinivas film Athadu : త్రివిక్రమ్ సినిమాల్లో హాలీవుడ్ ఇన్స్పిరేషన్ హీటేడ్ డిబేట్

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి