శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    stand in solidarity : ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు… అమెరికా దర్యాప్తుపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర బ్యాంకులు

    1 month ago

    వాషింగ్టన్:
    అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై అమెరికా ప్రభుత్వం క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఆయనకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. వడ్డీ రేట్ల నిర్ణయంలో స్వతంత్రత ఎంత కీలకమో గుర్తు చేస్తూ, ఫెడ్ స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కెనడా అధిపతులు సహా మొత్తం 11 మంది ప్రముఖ కేంద్ర బ్యాంక్ గవర్నర్లు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. “పావెల్ తన బాధ్యతలను నిజాయితీతో, ప్రజాప్రయోజనాలపై అచంచల నిబద్ధతతో నిర్వహించారు” అని వారు పేర్కొన్నారు.

    ఫెడరల్ రిజర్వ్ భవనాల పునర్నిర్మాణాలపై సెనేట్ కమిటీకి పావెల్ ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి ఈ దర్యాప్తు జరుగుతున్నట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దర్యాప్తు గురించి తనకు “ఏమీ తెలియదు” అని వ్యాఖ్యానించారు.  గత ఏడాది కాలంగా ట్రంప్ పావెల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. వడ్డీ రేట్లను మరింత వేగంగా తగ్గించాలని ఫెడ్‌పై ఒత్తిడి తెచ్చిన ట్రంప్, వ్యక్తిగతంగా కూడా పావెల్‌ను “మేజర్ లూజర్”, “నంబ్‌స్కల్” అంటూ దూషించిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటన విడుదల చేసిన ప్రపంచ కేంద్ర బ్యాంకర్లు, “మా దృష్టిలో పావెల్ ఒక గౌరవనీయ సహచరుడు. ఆయనతో పనిచేసిన ప్రతిఒక్కరూ ఆయనను అత్యున్నత గౌరవంతో చూస్తారు” అని పేర్కొన్నారు. ఇటీవలి వరకు ట్రంప్ విమర్శలపై మౌనం పాటించిన పావెల్, ఆదివారం మాత్రం స్పందిస్తూ ఫెడ్ స్వతంత్రత ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. “వడ్డీ రేట్లు ఆధారాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలా? లేక రాజకీయ ఒత్తిళ్లతో నడపాలా? అన్నదే ఇప్పుడు ప్రశ్న” అని ఆయన వ్యాఖ్యానించారు.

    సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఫెడ్ మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం కీలక రుణ రేటు సుమారు 3.6 శాతం వద్ద ఉంది. అయితే మరింత తగ్గింపులు ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చన్న ఆందోళనతో విధానకర్తలు విభేదిస్తున్నారు. డిసెంబర్ వరకు 12 నెలల్లో వినియోగ ధరలు 2.7 శాతం పెరిగాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఫెడ్ లక్ష్యమైన 2 శాతానికి మించి ఉంది. కేంద్ర బ్యాంకుల సంయుక్త ప్రకటనలో, “కేంద్ర బ్యాంకుల స్వతంత్రతే ధరల స్థిరత్వం, ఆర్థిక భద్రతకు మూలస్తంభం. చట్టపాలన, ప్రజాస్వామ్య బాధ్యతలను గౌరవిస్తూ ఈ స్వతంత్రతను కాపాడటం అత్యంత కీలకం” అని పేర్కొన్నారు.

    2017లో ట్రంప్ తొలి పదవీకాలంలో పావెల్‌ను ఫెడ్ ఛైర్మన్‌గా నామినేట్ చేశారు. ఆయన మే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌ను ట్రంప్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ దర్యాప్తుపై పలువురు రిపబ్లికన్ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెనేట్ బ్యాంకింగ్ కమిటీ సభ్యుడు, నార్త్ కరోలైనా సెనేటర్ థామ్ టిల్లిస్, ఈ అంశం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పావెల్ వారసుడి నియామకానికి తాను మద్దతివ్వబోనని స్పష్టం చేశారు. మరో సెనేటర్ కెవిన్ క్రేమర్ పావెల్ పనితీరుపై విమర్శలు చేసినప్పటికీ, ఆయన నేరస్థుడని తాను నమ్మడం లేదని తెలిపారు. లిసా మర్కోవ్‌స్కీ ఈ దర్యాప్తును “బలవంతపు ఒత్తిడి ప్రయత్నం”గా అభివర్ణించారు.

    పావెల్‌కు మాజీ ఫెడ్ ఛైర్మన్లు జానెట్ యెలెన్, బెన్ బెర్నాంకీ, ఆలెన్ గ్రీన్‌స్పాన్ కూడా మద్దతు ప్రకటించారు. యెలెన్ ఈ దర్యాప్తును “అత్యంత భయంకరమైన పరిణామం”గా పేర్కొంటూ, పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. “ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన దారి” అని ఆమె హెచ్చరించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    MI vs GG, WPL Live: Gujarat finish strong with late flourish from Fulmali, Wareham
    తర్వాత ఆర్టికల్
    Malaika says Arjun 'is an integral part of my life' after breakup

    సంబంధిత అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి