శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ap Deputy Cm Pawan Kalyan : విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందన : సోషల్ మీడియాలో వీడియో చూసి కదిలిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

    2 weeks ago

    నెల్లూరు:
    బురద రోడ్డులో నిత్యం పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందంటూ గజ్జలవారిపల్లి విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయాన్ని కదిలించింది. “పవన్ సర్… మా ఊరికి రోడ్డు వేయండి” అంటూ పిల్లలు చేసిన విజ్ఞప్తికి ఆయన తక్షణమే స్పందించి రోడ్డు మంజూరు చేయించారు.

    శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు రోడ్డు లేక పడుతున్న ఇబ్బందులను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో, వెంటనే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

    అధికారులతో అంచనాలు సిద్ధం చేయించి 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో శాంక్షన్ ఆర్డర్లు జారీ చేయించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామం నుంచి స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయని అధికారులు తెలిపారు.

    రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో పల్లెపండగ 1.0, 2.0 మరియు సాస్కీ నిధుల ద్వారా రూ. 55 కోట్లతో 641 రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్థనతో మరో రోడ్డును అదనంగా మంజూరు చేయడం ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఎంత సున్నితంగా స్పందిస్తుందో చూపిస్తోంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Tara on finding inner peace amid breakup rumours with Veer
    తర్వాత ఆర్టికల్
    5 mistakes to avoid when investing in under-construction projects

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి