శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    AP Minister Kollu Ravindra: వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. మహానాడు విజయాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆరోపణ

    1 hour ago

    ప్రకాశం జిల్లా పర్యటనలో పాల్గొన్న ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ మహానాడులో విస్తృతంగా చర్చించామని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే మహానాడుకు ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొంటూ, ఈసారి జరిగిన మహానాడు కార్యక్రమానికి లక్షలాది మంది ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో హాజరయ్యారని చెప్పారు. మహానాడు విజయవంతంగా జరగడం చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

    మెగా డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరారని గుర్తు చేశారు. అలాగే అమరావతి, లిక్కర్ స్కాం వంటి అంశాల్లో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ప్రజలు గత పరిణామాలను గుర్తుంచుకోవాలని సూచించారు. మహిళల పట్ల గౌరవం లేదంటూ విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Kohli’s aggressive celebrations steal the show after Gill, Sudharsan fall early — Watch
    తర్వాత ఆర్టికల్
    Magical movies to add to your watch list: 'Harry Potter' to 'Stardust'

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి