శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    DK Shivakumar : సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు.. డీకే శివకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు

    38 minutes ago

    కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి D. K. Shivakumar పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి సామాన్య కార్యకర్తకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 1979-80 కాలం నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్నానని, ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన తన ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి పదవి వరకు చేరుకుందని చెప్పారు.

    పార్టీ కోసం కష్టపడే గుణం ఉంటే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని డీకే శివకుమార్ పేర్కొన్నారు. స్కూల్, కాలేజీ స్థాయి నుంచి యువతను కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. కాగా, గత మూడు సంవత్సరాలుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన జూన్ 3న బెంగళూరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. Siddaramaiah రాజీనామా అనంతరం ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ Thawar Chand Gehlotను కలిసి అనుమతి కోరిన డీకే శివకుమార్, ఇప్పుడు రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    All about Alesha Dixon’s net worth
    తర్వాత ఆర్టికల్
    Cyient to acquire Tao Digital : అమెరికా కంపెనీ టావో డిజిటల్‌ను కొనుగోలు చేయనున్న సైయెంట్‌.. డీల్‌ విలువ రూ.2,071 కోట్లు

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి