శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    IPL 2026 Prize Money : ఐపీఎల్ 2026 ఫైనల్.. విజేతకు రూ.20 కోట్ల జాక్‌పాట్!

    1 hour ago

    ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ టోర్నమెంట్‌లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఐపీఎల్ ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతిని సొంతం చేసుకోనుంది.

    బీసీసీఐ ఈ సీజన్ కోసం మొత్తం రూ.46.5 కోట్ల ప్రైజ్ మనీని కేటాయించింది. టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల నగదు బహుమతి అందనుంది. ఫైనల్లో ఓడే రన్నరప్ జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. క్వాలిఫయర్-2లో నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.6.5 కోట్లు దక్కనున్నాయి.

    జట్లతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలకూ బీసీసీఐ ప్రత్యేక బహుమతులు ప్రకటించింది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు, అలాగే మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌కు రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్న ఆటగాడికి రూ.20 లక్షలు అందజేయనున్నారు.

    ఐపీఎల్ ప్రారంభమైన 2008లో విజేత జట్టుకు రూ.4.8 కోట్ల ప్రైజ్ మనీ మాత్రమే ఉండేది. అనంతరం టోర్నీ ఆదరణ పెరుగుతున్న కొద్దీ బహుమతి మొత్తాన్ని కూడా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం విజేతకు రూ.20 కోట్ల బహుమతి అందించడం ద్వారా ఐపీఎల్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక లీగ్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.

    ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 ఫైనల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రోఫీతో పాటు కోట్ల రూపాయల బహుమతి ఎవరి ఖాతాలో చేరుతుందో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Taapsee Pannu opens up on the obsession with a 'flat stomach' among women
    తర్వాత ఆర్టికల్
    June 2026 bank holidays: When and where will banks remain closed? Check state-wise list

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి