శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    APAssembly : ఖైదీలకు క్షమాభిక్షపై ప్రభుత్వం సానుకూలం – జైళ్లు సంస్కరణల బిల్లు ఆమోదం

    2 hours ago

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 8వ రోజు జైళ్లు, సంస్కరణల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర హోం శాఖ మంత్రి Vangalapudi Anitha సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష అంశంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మేరకు రాష్ట్రంలో కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఖైదీలు జైలులోనే చదువుకునేలా అవకాశాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. మహిళా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేక అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఖైదీల నేరచరిత్ర–ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని పేర్కొన్నారు. మానసిక పరివర్తన కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లు, వ్యవసాయం వంటి వృత్తి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

     

    బిల్లుపై చర్చలో Dhulipalla Narendra పలు సమస్యలను ప్రస్తావించారు. ఖైదీల సంఖ్య పెరిగినా సౌకర్యాలు పెరగలేదని, జైళ్ల శాఖలో 30 శాతం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మహిళా సిబ్బంది కొరత, అండర్ ట్రయల్ ఖైదీలకు న్యాయ సహాయం లేకపోవడం వంటి అంశాలను గుర్తు చేశారు. చిన్న కేసుల్లో రిమాండ్ ఖైదీలను సత్‌ప్రవర్తన ఆధారంగా విడుదల చేయాలని, 60 ఏళ్లు దాటిన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జైళ్లు సంస్కరణల సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Why modern couples are skipping ‘hard launch’, and choosing the ‘no-launch’ relationship trend
    తర్వాత ఆర్టికల్
    'Ek Din' song out: Aamir requests Arijit to sing- Check BTS

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి