శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Court Objects to ‘South Group’ Term in Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసులో ‘సౌత్‌ గ్రూప్‌’ పేరుపై సీబీఐ కోర్టు అభ్యంతరం

    1 hour ago

    ఢిల్లీ లిక్కర్‌ కేసులో నిందితులను ప్రాంతం ఆధారంగా ‘సౌత్‌ గ్రూప్‌’ అని పిలవడంపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదానికి చట్టపరమైన ఆధారం లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం, నేరం నిరూపణ వ్యక్తి చేసిన చర్యలపై ఆధారపడి ఉండాలే తప్ప అతని ప్రాంతం లేదా గుర్తింపుపై కాదని తేల్చి చెప్పింది. మరి మిగతా వారిని ‘నార్త్‌ గ్రూప్‌’ అని ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తూ, ఇలాంటి పదజాలం పక్షపాతంగా కనిపిస్తుందని కోర్టు మందలించింది. ప్రాంతం ఆధారంగా నిందితులను వర్గీకరించడం ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడింది.

    అదే విధంగా చార్జ్‌షీట్లు తయారుచేసే సమయంలో దర్యాప్తు సంస్థలు తటస్థంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. సాక్ష్యాల ఆధారంగా మాత్రమే నిందితుల వివరాలు నమోదు చేయాలని, ప్రాంతం, జాతి లేదా జాతీయత వంటి అంశాలను ప్రస్తావించవద్దని స్పష్టం చేసింది. అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపుతూ, అలాంటి పద్ధతులు న్యాయమైన విచారణ హక్కుకు విరుద్ధమని పేర్కొంది. నిందితుడి చర్యలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అతని నేపథ్యాన్ని కేసులోకి లాగకూడదని సీబీఐ కోర్టు హెచ్చరించింది.  

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Priyanka Chopra shares details on fighting scenes in ‘The Bluff'
    తర్వాత ఆర్టికల్
    'Shah Rukh's KKR is more profitable than his movies,' says Karan Johar

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి