శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Janhvi Kapoor : జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ వర్క్ కల్చర్ ఫిదా.. ‘పెద్ది’ షూటింగ్ అనుభవాలు పంచుకున్న బాలీవుడ్ బ్యూటీ

    43 minutes ago

    మెగా పవర్ స్టార్ Ram Charan, బాలీవుడ్ నటి Janhvi Kapoor జంటగా నటిస్తున్న Peddi సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమ వర్క్ కల్చర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ముంబైతో పోలిస్తే టాలీవుడ్‌లో షూటింగ్‌లు మరింత క్రమబద్ధంగా జరుగుతాయని, ముఖ్యంగా నటీనటులు మాత్రమే కాకుండా టెక్నీషియన్లు, సిబ్బంది పని గంటలకు కూడా గౌరవం ఇస్తారని తెలిపారు. లంచ్ బ్రేక్‌లకు తగిన సమయం కేటాయించడం, విశ్రాంతికి అవకాశం ఇవ్వడం, షూటింగ్ షెడ్యూళ్లను ముందుగానే ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం తనకు ఎంతో నచ్చిందని చెప్పారు.

    రాత్రి షూటింగ్‌లు జరిగినా నిర్ణీత సమయానికి ముగించడంపై తెలుగు నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని జాన్వీ వెల్లడించారు. సాధారణంగా రోజుకు 9 నుంచి 10 గంటలకే షూటింగ్ పూర్తవుతుందని, 12 గంటలకు మించి పని చేసిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో బాలీవుడ్‌లో కొన్ని సందర్భాల్లో పని గంటల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న Peddiలో రామ్ చరణ్ సరసన జాన్వీ ‘అచియమ్మ’ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో Shiva Rajkumar, Jagapathi Babu, Boman Irani తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని A. R. Rahman అందిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Madhuri defends Aishwarya amidst body-shaming: 'Can't reduce her to a scale'
    తర్వాత ఆర్టికల్
    IPL Final: Kohli and Rajat Patidar leave Titans running out of options

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి