శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Election Commission of India : 27 ఏళ్ల తర్వాత కేంద్ర–రాష్ట్ర ఎన్నికల అధికారుల రౌండ్ టేబుల్ సమావేశం

    1 hour ago

    భారత ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో Election Commission of India కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని Bharat Mandapam వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం నిర్వహించనుంది. 27 ఏళ్ల తర్వాత కేంద్ర–రాష్ట్ర ఎన్నికల అధికారుల మధ్య ఇలాంటి సమావేశం జరగడం విశేషం. చివరిసారిగా 1999లో ఈ తరహా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ Gyanesh Kumar అధ్యక్షత వహిస్తారు. ఎన్నికల కమిషనర్లు Sukhbir Singh Sandhu, Vivek Joshi సమక్షంలో చర్చలు కొనసాగనున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు), చట్టపరమైన మరియు సాంకేతిక నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

     

    ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఈవీఎంల పటిష్టత, పారదర్శకత, భద్రత, ఓటర్ల జాబితాల నిర్వహణ వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇటీవల ప్రారంభించిన ఈసినెట్ డిజిటల్ వేదిక ద్వారా ఎన్నికల సేవలను మరింత సమర్థవంతంగా అందించడంపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఓటర్ల అర్హత, జాబితాల సవరణలపై రాష్ట్రాల వారీగా సమీక్ష చేయనున్నారు.  అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243కే, 243జేఏ ప్రకారం పంచాయతీలు, మున్సిపల్ సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ల పాత్రపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర ఎన్నికల సంస్కరణలు, జమిలి ఎన్నికలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణలో సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Mohammed Shami : జట్టులో షమీకి చోటివ్వాలి: Rohit Sharma
    తర్వాత ఆర్టికల్
    New data series: Real GDP growth data calculation methodology overhauled to improve accuracy - here’s what changes

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి