శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Flight Cancellations at Shamshabad Airport : ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రద్దు

    1 hour ago

    ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మార్గాలను మార్చడం ప్రారంభించాయి. ఈ ప్రభావం ముఖ్యంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్ట్) పై ఎక్కువగా కనిపిస్తోంది.

    శంషాబాద్ నుంచి గల్ఫ్ మరియు అరబ్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దు కాగా, విదేశాల నుంచి హైదరాబాద్ కు రావాల్సిన 21 విమానాలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా దుబాయ్, దోహా, కువైట్ సిటీ, దమ్మమ్, సౌదీ అరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇరాన్, ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రాలను మూసివేయడం లేదా ప్రమాదకరంగా ప్రకటించడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం 2 నుంచి 3 గంటల వరకు పెరుగుతోంది. దీని కారణంగా ఇంధన ఖర్చులు పెరిగి, టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముందని విమానయాన వర్గాలు చెబుతున్నాయి.

    ప్రస్తుతం పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతుండటంతో, గల్ఫ్ దేశాలకు ప్రయాణించాలనుకునే వారు తమ ఎయిర్‌లైన్‌ల అధికారిక సమాచారం తెలుసుకుని మాత్రమే ఎయిర్‌పోర్ట్‌కు రావడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. యుద్ధ మేఘాలు వీడిన తర్వాతే సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించే అవకాశముంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Jim Carrey wears sunglasses after eye colour row- WATCH
    తర్వాత ఆర్టికల్
    Delroy Lindo addresses BAFTA controversy after a week

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి