శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Flyover Works Begin Near Park Hyatt in Banjara Hills : బంజారాహిల్స్‌లో ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభం

    1 hour ago

    బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2లోని పార్క్‌ హయత్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును మేఘా నిర్మాణ సంస్థ చేపడుతోంది. పనులు ప్రారంభమైన ప్రాంతాన్ని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌తో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా పరిశీలనలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాసుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఫ్లైఓవర్‌ పనులు నేటి నుంచి ప్రారంభమైనట్లు చెప్పారు. నిర్మాణ పనుల నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని సహకరించాలని సూచించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    6 famous UK royals who lived lavishly while their siblings had simpler lives
    తర్వాత ఆర్టికల్
    Basil Joseph to join Rajinikanth in 'Thalaivar 173'

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి