శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Gudivada : గుడివాడలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

    3 నెలలు క్రితం

    కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ–పామర్రు రోడ్డులో వెలసిన శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు భక్తుల మధ్య వైభవంగా నిర్వహించారు.

     

    ఈ సందర్భంగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. పేద పండితులు శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు వారి పర్యవేక్షణలో స్వామివారిని వెన్నతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

     

    వ్రతాలు, పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తుల సందడితో పుణ్యక్షేత్రంలా మారింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Mahesh Bhatt reacts to Arijit Singh's retirement
    తర్వాత ఆర్టికల్
    Govt On Track To Meet 4.4% Fiscal Deficit Target, Says Economic Survey; Flags Strong Capex Push

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి