శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Hospitals Premier League Cricket Tournament : భారీ ఏర్పాట్లు మధ్య హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు సర్వం సిద్ధం.

    1 hour ago

    కాకినాడ ( తొలి ఉదయం)

    కాకినాడ నగరంలో వైద్య రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా ట్రినిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడా కార్యక్రమం రేపటి నేటి నుండి ప్రారంభం కానుంది.  స్థానిక ఆర్ టి వో కార్యాలయం సమీపం వద్ద గల ప్లే ఫిట్ బాక్స్ క్రికెట్ గ్రూప్ లో   12 జట్లు, 12 ఆసుపత్రులు, మొత్తం 144 మంది వైద్యులు మరియు సిబ్బంది పాల్గొననున్న ఈ మహోత్సవం నగర చరిత్రలోనే తొలిసారిగా వివిధ ఆసుపత్రులు ఒకే వేదికపైకి రావడం విశేషం.  ఎప్పుడూ రోగుల సేవలో, అత్యవసర శస్త్రచికిత్సల్లో, రాత్రింబవళ్లు విధుల్లో నిమగ్నమై ఉండే వైద్యులకు ఈ క్రీడా వేడుక నిజమైన ఆటవిడుపుగా మారనుంది. ఆసుపత్రుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు పరస్పర అవగాహన, స్నేహ సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

     

    నిర్వాహకులుగా ముందుండి ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ట్రినిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ రీక్కీ గూటం పాత్ర విశేషంగా నిలుస్తోంది. వైద్య సేవలతో పాటు వైద్యుల మానసిక ఆరోగ్యం, టీమ్ స్పిరిట్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. “వైద్యులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటేనే సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించగలరు” అనే సందేశాన్ని ఈ క్రీడా వేడుక ద్వారా అందిస్తున్నారు.   క్రీడా స్పూర్తి, సమన్వయం, పరస్పర గౌరవం—ఈ మూడు మూల సూత్రాలతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పోటీలు కేవలం విజయం కోసం కాకుండా, పరస్పర సహకారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి వేదికగా నిలవనున్నాయి.

     

    కాకినాడలో వైద్య రంగానికి ఇది ఒక కొత్త దిశ. ఆసుపత్రుల మధ్య పోటీ ఉన్నా, సేవలో ఐక్యత ఉండాలనే భావనను ప్రతిబింబించే ఈ కార్యక్రమం నగరంలో స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలవనుంది. ట్రినిటీ హాస్పిటల్స్ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం భవిష్యత్తులో మరిన్ని సామాజిక, క్రీడా కార్యక్రమాలకు దారితీయాలని ఆశిద్దాం.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Javed Akhtar slams Taliban’s ‘wife beating’ law
    తర్వాత ఆర్టికల్
    Kuwait’s proposed freelance visa could benefit over 1 million Indians; how it may improve job flexibility

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి