శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    IED Recovered in Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ఐఈడీ నిర్వీర్యం, దేశవ్యాప్తంగా హై అలర్ట్

    2 గంటలు క్రితం

    దేశ రాజధాని Delhiతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలపై ఉగ్ర దాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ Lashkar-e-Taiba (ఎల్‌ఈటీ) ఐఈడీ బాంబులతో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు.

     

    ఈ క్రమంలో Jammu and Kashmirలోని గండేర్‌బాల్ జిల్లాలో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సఫాపోరా ప్రాంతంలోని కోహెస్తాన్ కాలనీ సమీపంలో రోడ్డుపక్కన ఉన్న ఓ బ్యాగులో ఐఈడీని గుర్తించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ సాయంతో పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేశారు. ఘటనాస్థలిని భద్రతా దళాలు చుట్టుముట్టగా, వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్ర ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Virat Kohli, Anushka Sharma SPOTTED at Gateway of India
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup Live: PAK opt to bat first vs NZ as rain threat looms over Super 8 game

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి