శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tamil Nadu Cm Vijay : తొలి ప్రజా పర్యటనకు సీఎం విజయ్ సిద్ధం.. తిరుచ్చిలో భారీ సభకు ఏర్పాట్లు

    1 hour ago

    తమిళనాడు ముఖ్యమంత్రి Vijay తన తొలి ప్రజా పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ప్రజలను నేరుగా కలవనున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం తిరుచ్చిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీవీకే నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

    చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి చేరుకోనున్న విజయ్, అక్కడి నుంచి ఓపెన్ వ్యాన్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ప్రజల్లోకి వస్తుండటంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. తిరుచ్చి పర్యటన అనంతరం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా పర్యటిస్తూ పార్టీ విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు సమాచారం.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Niall Horan on meeting Liam Payne the last time
    తర్వాత ఆర్టికల్
    ‘Darlings’ director Jasmeet K. Reen to helm ‘The Royals’ Season 2

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి