శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Janaseena Party Membership Enrollment Program : జగ్గయ్యపేటలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

    1 hour ago

    జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి పట్టణంలో తొలి సభ్యత్వాన్ని సామినేని ప్రసాద్ బాబు నమోదు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షులు Pawan Kalyan ఆదేశాల మేరకు జగ్గయ్యపేట పట్టణంలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తనయుడు, యువ నాయకుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బస్ స్టాండ్ సమీపంలో కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.

    ప్రసాద్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి వార్డులో జనసేన సిద్ధాంతాలను నమ్మే కార్యకర్తలను ఏకం చేయడమే లక్ష్యమని తెలిపారు. 2014లో 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన నేడు 13 లక్షలకు పైగా సభ్యులతో బలమైన శక్తిగా ఎదిగిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని పేర్కొన్నారు. క్రియాశీలక సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేసి, ఇందుకోసం ఇప్పటికే రూ.2 కోట్ల భారీ విరాళం అందించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Assi' actress Kani Kusruti makes an earnest plea
    తర్వాత ఆర్టికల్
    Nvidia sees 94% surge in Q1 sales: Chipmaker reports strong AI-driven growth

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి