శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    PM-SETU అమలులో దేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. విశాఖ ఐటీఐలకు నూతన రూపు

    1 hour ago

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే తొలిసారిగా PM-SETU పథకాన్ని అమలు చేయనున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కు ఆమోదం లభించింది. దీంతో విశాఖపట్నంలోని ఐటీఐలు ఆధునిక సాంకేతిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందనున్నాయి. ప్రముఖ ఉక్కు సంస్థ ArcelorMittal భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపట్టనుండగా, అకడమిక్ భాగస్వామిగా NAMTECH వ్యవహరించనుంది.

     

    జాతీయ స్థాయిలో రూ.60,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ను అమలు చేయనున్నారు. ఐటీఐ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందించి, కోర్సు పూర్తయ్యాక నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే PM-SETU ప్రధాన లక్ష్యం. ‘వికసిత్ భారత్ 2047’ దిశగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ ఐటీఐలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మరో 12 రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Fruit and vegetable peels : తొక్కలు పడేయడానికి ముందు ఇది తప్పక చదవండి!
    తర్వాత ఆర్టికల్
    Pakistan national cricket team : వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్‌కు అరుదైన ఘనత.. 1000 మ్యాచ్‌లు పూర్తి చేసిన మూడో జట్టు

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి