శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Malisetti Siva Shankar : బలిజ సంఘ బలోపేతానికి కట్టుబడి పని చేస్తా: మలిశెట్టి శివశంకర్

    2 hours ago

    నెల్లూరు జిల్లా పొదలకూరులో బలిజ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మలిశెట్టి శివశంకర్ సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం పొదలకూరు పట్టణంలోని ఆకులూరి నారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని, కమిటీ నిర్ణయాలను గౌరవిస్తూ సమీకృత నిర్ణయాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

    సంఘంలోని నిరుపేదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, చదువు కొనసాగించలేని విద్యార్థులను గుర్తించి వారి విద్యాభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి సంఘ నాయకులతో సంప్రదింపులు జరిపి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అలాగే ప్రతిభావంతులైన చిన్నారులకు సాంస్కృతిక, క్రీడా, కళారంగాల్లో తర్ఫీదు కల్పించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకునేలా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Don’t think PCB chief has given full freedom': Mohsin Naqvi under fire
    తర్వాత ఆర్టికల్
    US airlines warn of disruption as DHS suspends PreCheck, Global Entry during shutdown

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి