శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Medicover Hospitals : సామాన్యుడికి సైతం అందుబాటలో మెడికవర్ హాస్పిటల్ వైద్య సేవలు- సెంటర్ హెడ్ నందికోళ్ల అంజిబాబు

    6 hours ago

    కాకినాడ (తొలి ఉదయం): ప్రస్తుత కాలంలో వైద్య ఖర్చులు సాధారణ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్న నేపథ్యంలో, వైద్యం సామాన్యుడికి భారంగా మారకూడదనే లక్ష్యంతో Medicover Hospitals కాకినాడ ఏడిబి రోడ్డులో ప్రత్యేక రాయితీ ధరల్లో సమగ్ర ఆరోగ్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నిర్ణయం ప్రాంత ప్రజల్లో ఆశాభావాన్ని కలిగిస్తోంది.

    ఉభయ గోదావరి జిల్లాల్లోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ వైద్య కేంద్రంగా సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఆసుపత్రిలో 65 మందికి పైగా అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, 600 మందికి పైగా సిబ్బంది సేవలందిస్తున్నారు. అత్యాధునిక నిర్ధారణ పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాల ల్యాబ్ సదుపాయాలు, 24 గంటల క్యాజువాలిటీ అత్యవసర సేవలతో ప్రజలకు సమగ్ర వైద్య భరోసా కల్పిస్తోంది.

    గుండె, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక హెల్త్ చెక్-అప్ ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు యూనిట్ సెంటర్ హెడ్ నందికోళ్ల అంజిబాబు తెలిపారు. వ్యాధి తీవ్రత పెరగకముందే గుర్తించి చికిత్స అందించడం ద్వారా కుటుంబాల ఆర్థిక భారం తగ్గించవచ్చని ఆయన వివరించారు.

    అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న Dr. YSR Aarogyasri Health Care Trust ద్వారా అర్హులైన రోగులకు ఉచిత చికిత్స అందుబాటులో ఉందని, వివిధ ప్రైవేట్ మరియు కార్పొరేట్ బీమా పాలసీలను కూడా ఆసుపత్రిలో అంగీకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రజలు తమ బీమా సదుపాయాలను వినియోగించుకుని నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా సేవగా భావిస్తూ పారదర్శకత, నాణ్యత, సత్వర స్పందన అనే మూడు ప్రధాన సూత్రాలతో ఆసుపత్రి ముందుకు సాగుతోందని, పేద–మధ్యతరగతి కుటుంబాలు ఖరీదైన నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉత్తమ వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

    ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, కుండల సాయి కుమార్ యాదవ్, తుమ్మలపల్లి నాని, కాళ్ళ ధనరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆరోగ్య భద్రతే నిజమైన సంపద అనే సందేశాన్ని సమాజంలో విస్తృతంగా చాటుతోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    5 hit songs written by Taylor Swift for other artists, like Miley Cyrus
    తర్వాత ఆర్టికల్
    Holi 2026 Warning: सिंथेटिक रंगों से स्किन-आंखों और फेफड़ों को कैसे हो सकता है नुकसान? जानें इनसे बचने का तरीका

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి