శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Minister TG Bharat’s Remarks on Industrial Progress in AP : ఏపీలో పారిశ్రామిక ప్రగతిపై మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు

    1 hour ago

    జగన్‌ హయాంలో 913 కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిపోయాయని ఏపీ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఆర్బీఐ నివేదికల ప్రకారం 2019–20లో రాష్ట్రంలో 16,924 పరిశ్రమలు ఉండగా, 2023–24 నాటికి అవి 16,011కు తగ్గినట్లు పేర్కొన్నారు. జగన్‌ పాలనలో పారిశ్రామిక ప్రగతి పరిస్థితి ఎలా ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గుజరాత్‌, కర్ణాటక‌, మహారాష్ట్ర‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రతి ఏడాది పరిశ్రమలు పెరుగుతుండగా, ఏపీలో మాత్రం తగ్గుదల కనిపించిందని అన్నారు.

     

    అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రి, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని, చంద్రబాబు బ్రాండ్‌ కారణంగా పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వైసీపీ నేతల విమర్శలు ప్రజలను ప్రభావితం చేయలేవని మంత్రి టీజీ భరత్‌ మండిపడ్డారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India’s GDP grows at 7.8% in Q3 FY 2025-26: Top highlights from first data under new series
    తర్వాత ఆర్టికల్
    Sivakarthikeyan answers on collaborating with Ajith

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి