శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Municipal Elections 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహం

    3 వారాలు క్రితం

    • అమెరికా నుంచే సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి… 90 శాతం స్థానాలే లక్ష్యం

    హైదరాబాద్:
    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ గట్టిగా భావిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న కాంగ్రెస్, అదే జోష్‌ను పట్టణ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని వ్యూహాలకు పదును పెడుతోంది.

    ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ, మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి చౌదరి కూడా హాజరయ్యారు.

    116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు… 90 శాతం లక్ష్యం

    సమీక్ష సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై మంత్రులు నివేదికలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు.
    రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 90 శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.

    రెబల్స్‌పై కఠిన ఆదేశాలు

    ఎక్కడా కూడా రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు కావడంతో, ఆలోపు రెబల్స్‌తో మాట్లాడి తప్పనిసరిగా విత్‌డ్రా చేయించాలని మంత్రులకు ఆదేశించారు. రెబల్స్ బరిలో ఉంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. టికెట్లు రాని నాయకులకు భవిష్యత్తులో తగిన గుర్తింపు, అవకాశాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని, ప్రతి నాయకుడికి తగిన ప్రతిఫలం దక్కుతుందని సీఎం పేర్కొన్నారు.

    మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

    ఫిబ్రవరి 11 – పోలింగ్

    ఫిబ్రవరి 13 – ఓట్ల లెక్కింపు

    ఫిబ్రవరి 16 – మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక

    ఈ నెల 28న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, జనవరి 30న ముగిసింది.
    ఫిబ్రవరి 3న విత్‌డ్రాలకు అవకాశం ఉండగా, చాలా చోట్ల రెబల్స్ బరిలో నిలవడం కాంగ్రెస్‌కు ఆందోళనగా మారింది.

    ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికలు

    ఈ మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పట్టణాల్లో ఆధిపత్యం కోసం అన్ని పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Union Budget 2026: Education sector bets on skilling, digital infra and teacher upskilling
    తర్వాత ఆర్టికల్
    Bollywood stars mourn Catherine O’Hara’s demise

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి