శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Vijayawada: భారీ వర్షాలు, ఈదురుగాలులకు విజయవాడలో ముగ్గురు మృతి.

    3 hours ago

    విజయవాడ నగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలిపోవడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై తెగిపడి పడిన హైటెన్షన్ విద్యుత్ తీగపై అడుగుపెట్టడంతో 42 ఏళ్ల హోంగార్డు జానీ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మరో ఘటనలో వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో విద్యుత్ మీటర్ బాక్స్‌ను తాకిన ఐదేళ్ల చిన్నారి చల్లా మాధవి ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఐజీఎంసీ స్టేడియం సమీపంలోని ఈట్ స్ట్రీట్‌లో బిర్యానీ స్టాల్ వద్ద జనరేటర్ వైర్ తగలడంతో 19 ఏళ్ల పండలి సూర్యప్రకాశ్ మృతి చెందాడు.

     

    అదే సమయంలో కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెంలో బలమైన గాలులకు తాటిచెట్టు కూలిపడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గరికపాటి మనోహర్ (29), చుటూరి శివరామకృష్ణ మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా చెట్టు వారి వాహనంపై పడింది. మనోహర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన శివరామకృష్ణ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటనలతో జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    PAK vs AUS 1st ODI Live: Six Down! Salman Ali Agha puts Australia on the back foot
    తర్వాత ఆర్టికల్
    RR IPL 2026 Review: Sooryavanshi’s season, playoff fight and the road ahead

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి