శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. రూ.1.1 కోట్ల పెట్టుబడికి రూ.34.97 కోట్ల విలువ!

    1 hour ago

    Vaibhav Suryavanshi ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరించడమే కాకుండా, Rajasthan Royals ఫ్రాంచైజీకి భారీ విలువను తీసుకొచ్చాడు. గత ఏడాది రూ.1.1 కోట్లకు అతడిని సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ఈ సీజన్‌లో అతడి ప్రదర్శన ద్వారా రూ.34.97 కోట్ల మేర లాభం పొందినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అంటే పెట్టుబడిని మినహాయిస్తే రూ.33.87 కోట్ల నికర విలువను అందించినట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రతి రూపాయికి రూ.31.79 విలువను జట్టుకు అందిస్తూ అత్యధిక లాభం చేకూర్చిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ మూడో స్థానంలో నిలిచాడు.

     

    కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్, 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. అందులో 521 పరుగులు పవర్‌ప్లే ఓవర్లలోనే రావడం అతడి దూకుడు బ్యాటింగ్‌కు నిదర్శనం. Sunrisers Hyderabadపై 36 బంతుల్లో శతకం బాది ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అదే జట్టుతో జరిగిన ఎలిమినేటర్‌లో 29 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టును క్వాలిఫయర్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి పుల్ షాట్ ఈ సీజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, భవిష్యత్తులో జరిగే మెగా వేలంలో రూ.15 నుంచి 18 కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Satwik-Chirag stun world No 1 Koreans, enter Singapore Open final
    తర్వాత ఆర్టికల్
    Actors who publicly criticized their own movies

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి