శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Pedana MLA Kagita Krishna Prasad : తిరుమల వెంకన్నతో పెట్టుకున్నారు… రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం

    3 weeks ago

     

    • వైసీపీపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణా ప్రసాద్ తీవ్ర విమర్శలు

    బంటుమిల్లి, జనవరి 29, 2026:
    తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే వైసీపీ పార్టీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం బంటుమిల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహా కూటమి నాయకులతో కలిసి వైసీపీ పాలనలో లడ్డు ప్రసాదం కల్తీపై ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని నెయ్యి బదులు పామాయిల్, రసాయనాలతో తయారు చేసి రూ.250 కోట్ల మేర దోచుకున్నట్టు సిట్ నివేదికలో స్పష్టమైందని ఎమ్మెల్యే తెలిపారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు ఇప్పటికీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వారి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

    కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఫలితమే వైసీపీ పతనం అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వారికి ఒక్క అంకె సీట్లు కూడా దక్కవని స్పష్టం చేశారు. లడ్డు కల్తీ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే నీచమైన కుట్రతో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే వైసీపీ నాయకుల్లా తప్పులు చేసినప్పుడు మౌనం వహించే సంస్కారం జనసేనకు లేదని, అందుకే వెంటనే మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని కూటమి నాయకులు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు, డీసీసీ చైర్మన్ బొర్రా కాశీ, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్‌లు ఓడుగు తులసిరావు, భూపతి రమేష్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అంగర రంగనాధ్, మహా కూటమి నాయకులు యిల్లూరి లీలాకృష్ణ, కూనసాని చిన్న, ఎండీ నజీర్, నూర్, బాజని, రేవు శ్రీనివాస్ రావు, గంధం సత్యనారాయణ, వక్కలగడ్డ కరుణాకుమార్, దాసరి నానీబాబు, బొల్లా శ్రీనివాస్ రావు, బడుగు వెంకటేశ్వరరావు, పెందుర్రు కొండా, సన్నాల ప్రసాద్, ఐటీడీపీ నాని తదితరులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Air India places orders for 30 additional Boeing 737s
    తర్వాత ఆర్టికల్
    Youhana, Younis, Butt… but not enough: When Irfan's hat-trick couldn't save India

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి